![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -92 లో....నారాయణ ఇంటికి వచ్చి గాయత్రి పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని అబ్బాయి వాళ్ళతో నేను మాట్లాడుతుంటే.. నా పుత్రరత్నం వచ్చి అమ్మాయి కుటుంబం మంచిది అని చెప్పాడు.. వీడు ఈ జన్మలో మారాడు అని నారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత మాధవిని తీసుకొని చక్రి చల్లగాలికి అని బయటకు వస్తాడు. అప్పుడే గాయత్రి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు , సౌండ్ వినిపిస్తుంది. డాబా పైన చూస్తే అక్కడ గాయత్రి, మాధవ వంక చూస్తుంది.
అది చూసి అన్నయ్య పోదాం పదా అని అక్కడ నుండి మాధవని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత మాధవ పరధ్యానంలో ఉండి స్టవ్ పై ఉన్న కూరని మాడ్చేస్తాడు. గాయత్రికి పెళ్లి అయి వెళ్ళిపోతుందన్న బాధలోనే మాధవ ఉంటాడు. అందరు భోజనం చేస్తుంటే అన్ని సిద్ధం చేసి నాకు ఆకలిగా లేదని వెళ్ళిపోతాడు మాధవ. ఆ తర్వాత నారాయణ దగ్గరికి మాధవ వెళ్తాడు. ఇక మాధవకి నారాయణ డ్రింక్ పోస్తాడు.. అది మాధవ తాగుతుంటాడు . అప్పుడే కన్నా, మహా వచ్చి మాధవ డ్రింక్ చెయ్యడం చూసి షాక్ అవుతారు. ఆ విషయం చక్రి, కేశవ రాగానే మహా చెప్తుంది.
అందరు కలిసి మాధవ దగ్గరికి వెళ్తారు. ఏంటి అన్నయ్య ఇది అని ఎమోషనల్ అవుతారు. నాకు చాలా బాధగా ఉందిరా నేను గాయత్రిని మర్చిపోలేకపోతున్నాను.. నేను మీ కోసం నిద్రపోతున్నట్లు నటిస్తున్నాను కానీ నాకు నిద్ర రావడం లేదు గాయత్రికి పెళ్లి ఫిక్స్ అయిన నుండి నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను.. అది ఎక్కడ నుండి వస్తుందోనని చూస్తున్నానని మాధవ తనలోని బాధని చెప్తూ ఎమోషనల్ అవుతాడు. దాంతో ముగ్గురు తమ్ముళ్లు తనని పట్టుకొని ఏడుస్తారు. ఆ తర్వాత చక్రి, మహా పక్కకి వచ్చి మాట్లాడుకుంటారు. హమ్మయ్య అన్నయ్య తన బాధని మొత్తం బయట పెట్టేసాడని చక్రి అంటాడు. మరొకవైపు కేశవతో శైలు చేసిన రీల్స్ మిలియన్ వ్యూస్ వచ్చిందని శైలుకి తన ఫ్రెండ్ కాల్ చేసి చెప్తుంది. దాంతో శైలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |